రాశిఖ‌న్నా ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకొంద‌ట‌గా!

Sunday, September 25th, 2016, 04:42:20 PM IST

raasi-kanna
ఏళ్ల త‌ర‌బ‌డి ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నా ఇప్ప‌టికీ హోట‌ల్స్‌లోనే కాలం గ‌డిపే క‌థానాయిక‌లు ఎంతోమంది. కానీ కొద్దిమంది మాత్రం సొంతంగా మ‌న‌కే ఓ ఇల్లుంటే సౌక‌ర్యంగా ఉంటుంది క‌దా అని కొనుగోలు చేసేస్తుంటారు. ఆమ‌ధ్య ఇలియానా హైద‌రాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేసింది. బాలీవుడ్‌కి వెళ్ల‌గానే ఇక్క‌డి ఇల్లు అమ్మేసి వెళ్లిపోయింది. ఇటీవ‌ల ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, రాశిఖ‌న్నాలు కూడా హైద‌రాబాద్‌లో ఇళ్ల‌ని కొన్నారు. త‌మ‌న్నా, అనుష్క‌లాంటి సీనియ‌ర్ భామ‌ల‌కి ఇప్ప‌టికీ హైద‌రాబాద్‌లో ఇళ్లు లేవు. అయితే రాశిఖ‌న్నా ఇల్లు కొనుక్కోవ‌డంతోపాటు, త‌న కుటుంబాన్ని కూడా షిప్ట్ చేసేసింది. మీడియా ముందుకు ఎప్పుడొచ్చినా నేను హైద‌రాబాద్ అమ్మాయిని అని చెబుతుంటుంది. అయితే ఆమె ఇల్లే కాదు, ఓ ఆఫీసుని కూడా సెట్ చేసుకోబోతోంద‌ని స‌మాచారం. అందుకోసం ఓ హీరో గెస్ట్‌హౌస్‌ని కొనుగోలు చేసింద‌ని వార్త‌లొస్తున్నాయి. ఆ హీరో గెస్ట్‌హౌస్‌ని రినొవేష‌న్ చేసి ఆఫీసుగా మార్చేయ‌నుంద‌ట రాశి. అయినా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి ఆఫీసులు కావాలి కానీ, హీరోయిన్‌కి ఎందుక‌న్న‌దే ప్ర‌శ్న‌. అయితే రాశి వేరేవో బిజినెస్ ప్లానింగ్స్ కోస‌మే ఆఫీసు కొనుండొచ్చ‌ని చెబుతున్నాయి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు.