న‌న్ను న‌మ్మించి మోసం చేశారు.. రాధికా ఆఫ్టే సంచ‌ల‌నం..!

Saturday, November 10th, 2018, 12:46:06 PM IST

బాలీవుడ్ హాట్ అండ్ బోల్డ్ భామ రాధికా ఆప్టే టాలీవుడ్‌లో కూడా మెరిసిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో బాల‌కృష్ణ స‌ర‌స‌న లెజెండ్, ల‌య‌న్ చిత్రాల్లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ త‌మిళంలో ర‌జ‌నీకాంత్ నుండి వ‌చ్చిన‌ క‌బాలీ చిత్రంలో కూడా న‌టించింది. ఇక సౌత్‌లో సాంప్ర‌దాయంగా న‌టించే ఈ భామ బాలీవుడ్‌లో మాత్రం స్కిన్ షో బాగానే చేసింది. ఇక ప‌ర్చేడ్ చిత్రంలో అయితే రాధికా ఏకంగా టాప్‌లెస్‌గా శృంగార స‌న్నివేశాల్లో న‌టించింది.

అయితే ఆచిత్రం ఒప్పుకునే ముందు అగ్రిమెంట్‌లో భాగంగా ద‌ర్శ‌క‌,నిర్మాత‌ల‌తో ఒప్పందం కుదుర్చుకుంద‌ట‌. ఆ చిత్రంలో 20నిముషాల నివిడిగ‌ల శృంగార స‌న్నివేశాల్లో న‌టించిన రాధిక‌.. ఇండియాలో విడుద‌ల చేస్తే తాను న‌టించ‌న‌ని తేల్చి చెప్పింద‌ట‌. దీంతో నాడు రాధికా డిమాండ్‌కి ఓకే చెప్పిన ద‌ర్శ‌క, నిర్మాత‌లు.. తాజాగా రాధికా న‌టించిన శృంగార స‌న్నివేశాలు డీవీడీ రూపంలో అమ్మ‌కానికి పెట్టార‌ట‌. దీంతో ఈ విష‌యం తెలుసుకున్న రాధిక ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ప‌ర్చేడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు త‌న‌ని న‌మ్మించి మోసం చేశార‌ని.. ఆవేధ‌న వ్య‌క్తం చేస్తోండ‌ట రాధిక‌. దీంతో ఒంటిపై బ‌ట్ట‌లు లేకుండా శృంగార స‌న్నివేశాల్లో న‌టించిన‌ప్పుడు త‌ప్పులేదు కానీ, ఇప్పుడు అవి డీవీడీ రూపంలో వ‌స్తుంటే షాకేందుక‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments