నీ నడుముకు మసాజ్ చేస్తానని అన్నాడు : రాధికా ఆప్టే ?

Wednesday, September 19th, 2018, 10:21:48 AM IST

సినిమా రంగంలో ఏ హీరోయిన్ చేయని డేర్ .. ఏ హీరోయిన్ చెప్పని రహస్యాలు .. సంచలనాలు రేపేది ఈ ఒక్క హీరోయినే. ఏది దాచుకోకుండా ఎలాంటి మొహమాటం లేకుండా జరిగిన విషయాలు చెప్పేస్తూ ఉంటుంది. ఇక కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇప్పటికే రాధికా ఎన్నో సార్లు పలు సంచలన విషయాలు చెప్పి పెద్ద దుమారమే రేపింది. లేటెస్ట్ గా మరో సంఘటన పై ఈ అమ్మడు స్పందించింది. తనకు ఓ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు బాగా నడుము నొప్పిగా ఉండేదని అయినా కూడా ఆ షూటింగ్ పూర్తీ చేసానని .. ఆ తరువాత హోటల్ రూమ్ కు వెళితే ఆ పక్క రూమ్ లోనే ఉన్న ఓ నటుడు తనతో అసభ్యకరంగా మాట్లాడాడని, కావాలంటే అర్థరాత్రి వచ్చి నడుముకు మసాజ్ చేస్తానని చెప్పి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది.

అయితే ఆ నటుడు ఎవరన్న విషయాన్నీ మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. ఈ విషయం పై ఎవరు ఆరాలు తీయడం లేదు .. ఎందుకంటే ఈ రాధికా ఆప్టే ఇలాంటివి ఇప్పటికే చాలా సార్లు చెప్పింది కాబట్టి .. అయితే పరిశ్రమలో హీరోయిన్స్ అంటే విలువ లేదని .. ఎవరికీ ఇష్టమొచ్చిన రీతిలో ట్రీట్ చేస్తారని చెప్పింది. ఇదివరకే ఓ ప్రముఖ హీరో తనను బెడ్ రూమ్ కు రమ్మని చెప్పాడన్న విషయం కూడా అప్పట్లో సంచలనం అయింది.