`ర‌క్త‌చ‌రిత్ర` గాళ్ ఎందుకీ రుస‌రుస‌!

Tuesday, October 9th, 2018, 12:24:08 AM IST

ఇదిగో ఇక్క‌డ రుస‌రుస‌లాడేస్తూ అలా ఎవ‌రినీ ప‌ట్టించుకోకుండా వెళ్లిపోతోంది ఎవ‌రో తెలుసా? ర‌క్త చ‌రిత్ర గాళ్.. లెజెండ్ నాయిక రాధిక ఆప్టే. అస‌లింత‌కీ ఎందుకీ భామ ఇంత రుస‌రుస‌గా ఉంది? అస‌లేమైంది? ఇదే సందేహంతో అభిమానులంతా తెగ ఇదైపోతున్నారు. ఆ కార‌ణ‌మేంటో.. తెలుసుకోవాల‌న్న కుతూహాలం అంత‌కంత‌కు నిల‌వ‌నీయ‌డం లేదెందుకో! ఏమై ఉంటుంద‌బ్బా!?

ఇదిగో ఇదే సందేహాన్ని అభిమానుల్ని నిల‌వ‌నీయ‌క‌పోవ‌డంతో డౌట్‌ వ్య‌క్తం చేస్తూ ఇన్‌స్టాగ్ర‌మ్‌లో రాధిక వెంట ప‌డ్డారు. ఆ వీడియోని పోస్ట్ చేసిన ఫోటోగ్రాఫ‌ర్ వైర‌ల్ భ‌యానీ వెంట ప‌డ్డారు. రాధిక ఎందుకింత అప్‌సెట్ గా ఉంది? క‌నీసం ఫోటోగ్రాఫ‌ర్లకు ఫోటోల‌కు ఫోజులైనా ఇవ్వ‌కుండా అలా పారిపోతోంది.. అస‌లేమంది? ఇదేం యాటిట్యూడ్? త‌నూశ్రీ కాంట్ర‌వ‌ర్శీ గురించి ప్ర‌శ్నిస్తే ఇలా చేస్తుందా? అంటూ ఒక‌టే ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మొత్తానికి ఈ ప్ర‌శ్న‌లు వేటికీ రాధిక ఆన్స‌ర్ చేయ‌లేదు. త‌న‌వెంట ప‌డుతున్న మీడియాని స్కిప్ కొట్టి దూరంగా లిఫ్ట్ ఎక్కి పారిపోయింది. త‌నూశ్రీ – నానా ప‌టేక‌ర్ వివాధంలో త‌నూశ్రీ‌కి త‌న వంతు స‌పోర్టును అందిస్తోంది రాధిక‌. పురుషాధిక్య ప్ర‌పంచంపై దండ‌యాత్ర‌లో భాగంగా ఇలా చెల‌రేగిపోతోంది. అందుకే మీడియా కూడా అలా వెంట‌ప‌డుతోంది. అదీ సంగ‌తి.

View this post on Instagram

No comments #radhikaapte

A post shared by Viral Bhayani (@viralbhayani) on