షాక్ … రజని సినిమా ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు !!

Friday, November 11th, 2016, 10:29:27 AM IST

Raghava-lawrence
భారీ హైప్ మధ్య విడుదలైన ”కబాలి” … సినిమా తరువాత సూపర్ స్టార్ రజని కాంత్ కు ఆ సినిమా భారీ నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా తరువాత అయన ”రోబో 2.0” చేస్తున్నాడు. క్రేజీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది, ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత రజని మళ్ళీ ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్ తో సినిమాకు ఓకే చెప్పాడు, ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రజని మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది! .. ఆ వివరాల్లోకి వెళితే .. కొరియోగ్రాఫర్ నుండి .. నటుడు, దర్శకుడిగా మారిన రాఘవ లారెన్స్ .. ‘కాంచన’, ‘స్టైల్’ , ‘గంగ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. పైగా రజనికి పెద్ద ఫ్యాన్ !! ఈ నేపథ్యంలో రజనికి ఓ కథ చెప్పి ఓకే చేయించాడట? థ్రిల్లర్ నేపథ్యంలో ఉండే కథ ఇదని .. ‘చంద్రముఖి’ తరహాలో ఉంటుందట !! కథ విన్న రజని వెంటనే ఓకే చెప్పాడట. మరి ‘రోబో2. 0’ తరువాత అయన పా రంజిత్ సినిమా మొదలు పెడతాడో .. లేక లారెన్స్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి !! మొత్తానికి రజని సినిమా ఛాన్స్ కొట్టేసిన లారెన్స్ .. భలే ఖుషి మీదున్నాడట !!