“RRR” విషయంలో రాజమౌళి వేస్తున్న స్ట్రాటజీయే వేరు..!

Friday, October 18th, 2019, 07:56:17 PM IST

గత కొన్ని రోజుల నుంచి కూడా తెలుగు నుంచి దేశంలోనే మరో భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న “RRR” సినిమాపై నానా రకాల రూమర్లు విన్పిస్తూనే ఉన్నాయి.ఇప్పటికీ కొనసాగుతున్నాయి.దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

ఇద్దరు మాస్ హీరోలు అందులోను రాజమౌళి దర్శకత్వంలో ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారన్న ఊహే అంచనాలకు అందట్లేదు.దీనితో ఇపుడు ఈ సినిమా షూటింగ్ ప్రతీ ఒక్కరూ ఎన్నో పుకార్లు సృష్టిస్తున్నారు.కానీ వీటన్నిటికీ పూర్తి భిన్నంగా రాజమౌళి స్ట్రాటజీయే వేరేగా ఉందని సినీ వర్గాల నుంచి సమాచారం.సినిమా మధ్యలో కొన్ని సార్లు షూటింగ్ నెమ్మదించడంతో అనుకున్న సమయానికి సినెమా రావట్లేదని ఇప్పుడు విపరీతంగా ప్రచారం జరుగుతుంది.

వచ్చే ఏడాది సమ్మర్ నుంచి దీపావళికి వాయిదా పడిందని ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వారు చెప్తున్నారు.కానీ రాజమౌళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాను మొదటగా అనౌన్స్ చేసిన విడుదల తేదీకే విడుదల చేసి తీరాలని ధృడంగా నిశ్చయించుకున్నారని తెలుస్తుంది.ఇప్పుడు వస్తున్న వార్తలకు అతీతంగా రాజమౌళి ఇలా ఫిక్స్ అయ్యినట్టు సమాచారం.మరి రాజమౌళి తాను అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తారో లేదో చూడాలి.