రాజమౌళి మల్టీస్టారర్ టైటిల్ అదేనా ?

Saturday, May 12th, 2018, 02:35:41 AM IST


బాహుబలి సినిమాతో సంచలనం రేపిన రాజమౌళి తన తదుపరి సినిమా ఎవరితో అన్న విషయం పై ఆసక్తి ఎక్కువైంది. అయితే అయన తన తదుపరి చిత్రాన్ని మెగా, నందమూరి హీరోలతో మల్టీస్టారర్ చేస్తానని చెప్పడం టాలీవుడ్ లో పెద్ద సంచలనం రేపింది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటించే మల్టి స్టారర్ త్వరలోనే సెట్స్ పైకి వచ్చెనందుకు కసరత్తులు మొదలయ్యాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. ఎన్టీఆర్ – చరణ్ లు బ్రదర్స్ గా కనిపిస్తారని అంటున్నారు. ఓ రకంగా కరణ్ అర్జున్ తరహాలో భారీ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కిస్తాడని అంటున్నారు. ఇక ఈ క్రేజీ మల్టి స్టారర్ కు ఏ టైటిల్ పెడతారన్నా విషయం పై పలు రకాల వార్తలు వస్తున్నాయి … తాజాగా ఓ టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా .. ఇద్దరు ఇద్దరే !! నట. అవును ఇద్దరి హీరోలకు సమన వాల్యూ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అందుకే ఈ టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఇందులో నిజం ఎంత అన్నది.

  •  
  •  
  •  
  •  

Comments