డిసెంబర్ నుండే సెట్స్ పైకి ట్రూపుల్ ఆర్ మల్టి స్టారర్ ?

Sunday, October 14th, 2018, 10:08:30 AM IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే క్రేజీ మల్టి స్టారర్ డిసెంబర్ నుండే సెట్స్ పైకి రానున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు రాజమౌళి ఈ నెల చివరి వారంనుండి ఈ వర్క్ షాప్ లో ఎన్టీఆర్, చరణ్ లు పాల్గొననున్నారట. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్స్ కోసం అన్వేషణ జరుగుతుంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తీ చేసి 2020 సంక్రాంతికి విడుదల చేస్తారట. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు నందమూరి హీరో, ఇటు మెగా హీరో కలిసి ఒకే సినిమాలో నటిస్తుండడం అటు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.