ఆ వార్తల్లో నిజంలేదంటున్న రాజశేఖర్ ?

Sunday, September 18th, 2016, 03:24:28 PM IST

Rajasekhar-Shivani
యాంగ్రీ యాంగ్ మెన్ గా ఇమేజ్ తెచ్చుకున్న రాజశేఖర్ ”గడ్డంగ్యాంగ్” సినిమా తరువాత అయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయడంలేదు. ఇక విలన్ గా టర్న్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు రాజశేఖర్. ఈ విషయం పక్కన పెడితే గత రెండు మూడు రోజులుగా రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. శివాని హీరోయిన్ గా నాగ శౌర్య సరసన నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. నిజానికి శివాని వందకువంద అనే సినిమాతో ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్ చేశారు కానీ అది కుదరలేదు, ఇప్పుడు మళ్ళీ శివాని ఎంట్రీ ఇస్తుందని వస్తున్న వార్తలపై హీరో రాజశేఖర్ స్పందించాడు. శివానిని హీరోయిన్ గా చేయాలనే ఆలోచన అయితే ఉంది కానీ అది ఇప్పుడే కాదు అని చెబుతూనే .. ప్రస్తుతం శివాని నాగ శౌర్య సరసన నటిస్తుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పేసాడు? ఓ మంచి ఫీల్ గుడ్ మూవీతో ఎంట్రీ ఇప్పించాలని ఫిక్స్ అయ్యారట!!