ర‌జ‌నీ-క‌మ‌ల్ హెలీకాఫ్ట‌ర్ ఎలా దిగిందో చూశారా?

Tuesday, January 9th, 2018, 03:43:20 PM IST

మ‌లేసియా లో కోలీవుడ్ `స్టార్‌నైట్` అద్భుతంగా సాగింది. ఈ వేడుక‌ల‌కు ఏకంగా 300 మంది కోలీవుడ్ స్టార్లు ఎటెండ‌య్యారు. న‌డిగ‌ర సంఘం భ‌వంతి కోసం కోట్లాది రూపాయ‌ల ఫండ్ క‌లెక్ట‌య్యింది. వేడుక ఆద్యంతం ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. అయితే ఈ వేడుక వెన‌క చాలానే ఆర్థిక‌, రాజ‌కీయ కోణాలు ఉన్నాయ‌న్న ప్ర‌చారం ఉంది. ఈ వేడుక‌ల్ని ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాసన్ త‌మ రాజ‌కీయ ప్ర‌స్థానానికి వేదిక‌గా వాడుకున్నార‌న్న ప్ర‌చారం కోలీవుడ్‌లో ఉంది. మునుముందు ఈ ఇద్ద‌రి పార్టీల్లోకి మ‌లేషియా నిధులు వ‌చ్చి చేర‌నున్నాయ‌న్న ప్ర‌చారం ఉంది. ఆ మేర‌కు పెద్ద త‌ల‌కాయ‌లు రెండూ మ‌లేసియా ప్ర‌ధానితో మాట్లాడార‌న్న వార్త‌లు ఉన్నాయి.

అదంతా స‌రే.. ర‌జ‌నీకాంత్‌- క‌మ‌ల్ ఇద్ద‌రూ ఒకే హెలీకాఫ్ట‌ర్‌లో న‌క్ష‌త్ర విఝ‌-2018 కార్య‌క్ర‌మాల కోసం స్టేడియంలో దిగుతున్న‌ప్ప‌టి ఓ వీడియో నెట్‌లో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో లో చాప‌ర్ దిగుతున్న వైనం అంతా సినిమాటిక్ అనిపించింది. రెండు మూడు నిమిషాల పాటు గాల్లోనే రెప‌రెప‌లాడిన చాప‌ర్ నెమ్మ‌దిగా దిగుతూ అభిమానుల‌కు బోలెడంత స‌ర్‌ప్రైజ్ ట్రీట్‌నిచ్చింది. అభిమానుల కేరింత లు , జేజేల మ‌ధ్య ఇద్ద‌రు స్టార్ హీరోలు దిగి అభివాదం చేశారు. ఇదిగో ఈ వీడియో చూస్తే ర‌జ‌నీ, క‌మ‌ల్ క్రేజు ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్న వేళ ఇది ఎంతో స్పెష‌ల్ అన్న మాటా వినిపిస్తోంది. ఎవ‌రో ఔత్సాహిక అభిమాని షూట్ చేసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లోకి వ‌చ్చింది.