ముగ్గురు విల‌న్ల‌తో ర‌జ‌నీ బంతాట‌!

Monday, April 9th, 2018, 08:15:41 PM IST


సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలో విల‌నీ చేయాలంటే ఆషామాషీనా? సూప‌ర్‌స్టార్ స్టామినాకు త‌గ్గ రేంజులో ఉండాలి. అయితే ఇటీవ‌లి కాలంలో ర‌జ‌నీ విల‌న్ల జాబితా ప‌రిశీలిస్తే, సూప‌ర్‌స్టార్ స్థాయికి త‌గ్గ విల‌న్లు సౌత్‌లో పుట్ట‌లేదేమో అనిపిస్తుంది. అందుకే ప్ర‌త్యేకించి మ‌న ద‌ర్శ‌కులు బాలీవుడ్‌కి వెళ్లి మ‌రీ విల‌న్ల‌ను ఇంపోర్ట్ చేసుకుంటున్నారా? అనిపించ‌క మాన‌దు.

ర‌జ‌నీకాంత్ 2.ఓ చిత్రంలో కిలాడీ అక్ష‌య్ కుమార్ అంత‌టివాడు విల‌నీ చేస్తున్నాడు. ర‌జ‌నీ ఆడే బంతాట‌లో అత‌డూ ఓ భాగం అయ్యాడు. ఇందులో క్రౌమేన్‌గా అక్ష‌య్ విల‌క్ష‌ణ‌మైన విల‌నీ ప్ర‌ద‌ర్శించ‌నున్నాడు. ఇక‌పోతే , కాలా చిత్రంలో నానా ప‌టేక‌ర్ అంత‌టి గ్రేట్ యాక్ట‌ర్ న‌టిస్తున్నారు. విల‌క్ష‌ణ‌త‌కు పెట్టింది పేరుగా చెప్పుకునే నానా బాలీవుడ్‌లో ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌లు పోషించారు. ఇక‌పోతే త‌దుప‌రి కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీ న‌టించే సినిమాకి బాలీవుడ్ నుంచే ఇంపోర్ట్ చేస్తున్నారు. మేటి క‌థానాయ‌కుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖి ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. ఓవైపు అవార్డు సినిమాల‌తో అట్టుడికిస్తున్న న‌వాజుద్దీన్ ర‌జ‌నీ సినిమాలో ఎలాంటి విల‌నీ పోషించ‌బోతున్నాడో అన్న ఆస‌క్తి నెల‌కొంది. మొత్తానికి ర‌జ‌నీ ఆడే బంతాట‌లో బాలీవుడ్ హీరోలంతా పావులు అని అర్థ‌మ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments