షాకింగ్ : “వినయ విధేయ రామ” లో రకుల్ ప్రీత్..!?

Saturday, November 17th, 2018, 02:12:45 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పక్కా మాస్ మసాలా చిత్రం “వినయ విధేయ రామ”. ఎవ్వరు ఊహించని మాస్ కాంబినేషన్ కావడంతో ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ప్రస్తుతం ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతుంది అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే రకుల్ ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ లో చెర్రీ తో స్టెప్పులు వెయ్యనుంది అని తెలుస్తుంది.ఇప్పటికే బోయపాటి ముందు సినిమాలు అన్ని చూసుకున్నా ప్రతీ సినిమాలో మనం ఒక ఐటెం సాంగ్ ను గమనించొచ్చు ఇప్పుడు కూడా అదే తరహాలో ఈ చిత్రంలో కూడా ఐటెం సాంగ్ ని పెడుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అందుకనే రకుల్ ప్రీత్ సింగ్ ను ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో చెర్రీ సరసన చిందులు వేయించేందుకు బోయపాటి శ్రీను ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది.