ఎన్టీఆర్ బయోపిక్ కోసం రకుల్ ఆట పాట ?

Wednesday, October 10th, 2018, 10:54:05 AM IST

బాలకృష్ణ టైటిల్ రోల్ లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. నందమూరి తారకరామారావు బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమా లో గ్లామర్ భామ రకుల్ ఫ్రీత్ సింగ్ స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ అందాల భామ శ్రీదేవి పాత్ర పోషిస్తుంది. ఎన్టీఆర్ సినీ కెరీర్ లో శ్రీదేవిది కూడా కీలక పాత్ర కావడంతో శ్రీదేవి గా రకుల్ ని ఎంపిక చేసారు. ఎన్టీఆర్ తో శ్రీదేవి చాలా సినిమాల్లో నటించింది .. అందులో చాలా వరకు సంచలన విజయాలు అందుకున్న సినిమాలు కావడం విశేషం. బాలకృష్ణ, రకుల్ లపై వేటగాడు సినిమాలోని ఆకుచాటు పిండెతడిచే సాంగ్ నే రీమేక్ చేస్తున్నారు. అప్పట్లో ఈ సాంగ్ ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. ఇందులో రకుల్ అచ్చు శ్రీదేవిలా ఉందంటూ యూనిట్ చెప్పుకుందట. ఈ రోజు రకుల్ పుట్టినరోజు సందర్బంగా ఆ లుక్ కి సంబందించిన ఫోటోను దర్శకుడు క్రిష్ విడుదల చేసారు.