హీరోయిన్ చిల‌క మాంత్రికుడి చేతిలో!

Wednesday, October 24th, 2018, 11:53:43 PM IST

అందాల క‌థానాయికల ప్రాణం ఎక్క‌డుందో చెప్ప‌గ‌ల‌రా? అన‌గ‌న‌గ ఏడు స‌ముద్రాలు దాటి, ఆవ‌ల ఉన్న మ‌ర్రిచెట్టులో మాంత్రికుడు ఓ చిల‌క‌లో ప్రాణం దాచాడు.. అని క‌ష్టంగా చెప్పాల్సిన ప‌నేలేదు. ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్ర‌మ్‌లో క‌థానాయిక‌ల చిలుక‌లు దాగి ఉంటాయంటే త‌ప్పేంలేదు. అంత‌గా సామాజిక మాధ్య‌మాల్లో బంధిఖానా అయిపోయారు మ‌న నాయిక‌లు.

తాజాగా పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ ఇన్‌స్టాగ్ర‌మ్‌ని ఎవ‌రో హ్యాక్ చేశార‌ట‌. దీంతో ర‌కుల్ తెగ కంగారు ప‌డిపోతోంది. ఇప్ప‌టికి అభిమానులు ఎవ‌రూ త‌న ఇన్‌స్టాలో పోస్టింగుల‌కు అస్స‌లు స్పందించ‌వ‌ద్ద‌ని చెప్పింది. త‌న ఇన్‌స్టా ఖాతాను త్వ‌ర‌గా రిక‌వ‌రీ చేయాల్సిందిగా ఇన్‌స్టా ప్ర‌తినిధుల్ని కోరింది. ఇదివ‌ర‌కూ త్రిష‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ట్విట్ట‌ర్‌ల‌ను హ్యాక్‌ చేసిన సంగ‌తి తెలిందే. ఆ త‌ర్వాత రిక‌వ‌రీ అయ్యే లోపు చాలానే గ్యాప్ రావ‌డం ఇబ్బంది ప‌డ‌డం చూశాం. ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ ఇన్‌స్టాని రిక‌వ‌రీ చేసే వ‌ర‌కూ చాలానే సంక‌టం పాపం!!

  •  
  •  
  •  
  •  

Comments