టాలీవుడ్ ట్రెండింగ్ మ్యాట‌ర్.. రామ్‌చ‌ర‌ణ్‌కి నో చెప్పిన ర‌కుల్..?

Friday, October 26th, 2018, 12:15:02 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తాజాగా ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్నా ఈ చిత్రంలో చెర్రి స‌ర‌స‌న కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ప‌క్కా మాస్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో ఒక మ‌సాలా ఐట‌మ్ సాంగ్‌ను పెట్టాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌.

అయితే ఈ నేప‌ధ్యంలో ఆ స్పెష‌ల్ సాంగ్‌లో చ‌ర‌ణ్ ప‌క్క‌న స్టెప్పులు వేయ‌డానికి స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని సంప్ర‌దించార‌ట‌. కానీ ఈ హట్ భామ మాత్రం తాను చాలా బిజీగా ఉన్నాన‌ని త‌న‌కు ప్ర‌స్తుతం కుద‌ర‌ద‌ని ర‌కుల్ నో చెప్పింద‌ట‌. దీంతో షాక్ తిన్న చిత్ర యూనిట్.. బాలీవుడ్ నుండి ఎవ‌రినైనా దింపాల‌ని ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేశార‌ట‌. దీంతో ర‌కుల్ పై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు చ‌ర‌ణ్ అభిమానులు. ర‌కుల్ ప్ర‌స్తుతం బిజీగా ఉండే అన్ని చిత్రాల్లో న‌టించ‌డం లేద‌ని ఐటం సాంగ్‌లో న‌టించేందుకు ఇష్టం లేక‌నే ర‌కుల్ క‌హానీలు చెబుతోంద‌ని సినీ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చించుకుంటున్నారు