వారుని బాగా ఫాలో అవుతా: రామ్ చరణ్

Wednesday, May 9th, 2018, 01:33:04 AM IST

రంగస్థలం సినిమాతో కెరీర్ లోనే గుర్తిండిపోయే విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఒక నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. చిట్టిబాబుగా అతని నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. స్టార్ హీరోగా మొన్నటి వరకు ఒక గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో ఒక చెవిటి వాడిగా కనిపిస్తున్నాడు అనగానే మొదట భిన్నా భిప్రాయాలు వెలువడినప్పటికీ రామ్ చరణ్ మాత్రం ఆ విషయాలను పట్టించుకోకుండా దర్శకుడు సుకుమార్ ని నమ్మరు.

అయితే అలాంటి కథ మరియు పాత్రకు ఒప్పుకోవడానికి చరణ్ ఓ కారణాన్ని చెప్పాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు అయినప్పటికీ సల్మాన్ ఖాన్ – అమిర్ ఖాన్ డిఫెరెంట్ క్యారెక్టర్ తో అలరిస్తుంటారు. వారి స్ఫూర్తి చాలా ఉంది. బజరంగీ భాయీజాన్ – దంగల్ వంటి సినిమాలు చేసిన వారు అందరికి ఆదర్శంగా నిలిచారు. అందుకే కథల విషయంలో వారిని ఫాలో అవుతుంటాను. అందులో భాగంగానే తాను రంగస్థలం చేసినట్టుగా రామ్ చరణ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments