రామ్ చరణ్ లుక్ ను చూసి షాక్ అయిన అభిమానులు!

Friday, July 3rd, 2020, 09:24:11 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత తన లుక్ ను అభిమానులకు చూపించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మనం చాలా రోజుల నుండి కలవలేదు అని, త్వరలో అందరినీ కలుస్తాం అని, ఇంట్లో వాళ్ళను అడిగినట్లు చెప్పు అని రామ్ చరణ్ అన్నారు. అంతేకాక తన అభిమానులకు కూడా స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ తన సందేశం ఇచ్చారు రామ్ చరణ్.

అయితే రామ్ చరణ్ ఈ సందేశం ను వీడియో రూపం లో విడుదల చేశారు. అయితే రామ్ చరణ్ గెడ్డం తో చాలా సన్నగా కనిపించారు. ఈ లుక్ ను చూసిన రామ్ చరణ్ అభిమానులు చాలా షాక్ కి గురి అయ్యారు. రామ్ చరణ్ రౌద్రం రణం రుదేరం చిత్రం లో కండలు తిరిగిన దేహం తో అల్లూరి సీతారామరాజు పాత్ర లో చాలా అందం గా కనిపించారు. అయితే సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాక పోవడం తో రామ్ చరణ్ ఇంటికే పరిమితం అయ్యారు. అయితే త్వరలో రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొనాలి అని, రౌద్రం రణం రుదీరమ్ చిత్రం త్వరగా రావాలి అని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.