మెగాస్టార్,పవర్ స్టార్ బాటలో మెగాపవర్ స్టార్.!

Thursday, March 26th, 2020, 03:22:30 PM IST


టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగు పెట్టారు. మొదట ఇన్స్టాగ్రామ్ తో మొదలు పెట్టి తర్వాత ట్విట్టర్ వరకు వచ్చారు. అలా రెండింటిలోనూ రికార్డు స్థాయి ఫాలోవర్స్ ను రాబట్టుకోడమే కాకుండా తనదైన శైలి పోస్టులతో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు.

అలాగే మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బాధితులకు గాను అటు రెండు తెలుగు రాష్ట్రాలు సహా కేంద్ర ప్రభుత్వాలకు మొత్తం 2 కోట్ల రూపాయలను దానం చేసారు. ఇప్పుడు వీరి బాటలోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు.

మెగాస్టార్ లా తన అధికారిక ట్విట్టర్ ఖాతాను ఈరోజు తెరవడం మాత్రమే కాకుండా బాబాయ్ పవర్ స్టార్ లా ఇలా వచ్చిన వెంటనే తాను కూడా 70 లక్షలు సాయం చేస్తున్నా అని తెలిపారు. ఇలా ఒకేరోజునా తండ్రి మెగాస్టార్ బాబాయ్ పవర్ పవర్ స్టార్ బాటలో తమ అభిమానులకు మంచి ఫీస్ట్ ఇచ్చే పని చేసారని చెప్పాలి.