లేటెస్ట్ బజ్ : మెగాస్టార్ 152కు రామ్ చరణ్ పక్కా ప్లానింగ్!

Thursday, November 14th, 2019, 06:38:36 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కథ మరియు కథనాల పరంగా సినిమా బాగున్నా ఒక్క తెలుగు మినహా విడుదల కాబడిన అన్ని చోట్లా మాత్రం ఊహించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది.అయినా సరే మెగాస్టార్ తదుపరి చిత్రంపై ఎలాంటి ఎఫెక్ట్ కూడా పడలేదు.సైరా చిత్రం లైన్ లో ఉండగానే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమాను కూడా లైన్ లో పెట్టేసారు.

దీనితో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించి కూడా నిర్మాతగా చిరు తనయుడు రామ్ చరణే ఉండనున్నట్లు సమాచారం.కానీ ఇప్పటి వరకు కూడా ఈ చిత్రంపై ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు.దీనితో మెగాభిమానులు ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కానీ రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్లాలని భావిస్తున్నారట.ఎలాంటి రూమర్లకు తావివ్వకుండా అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించేందుకు చరణ్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నారు.చిరు సరసన హీరోయిన్ తో సహా ప్రధాన క్యాస్టింగ్ అంతటిని కూడా ప్రకటించనున్నారని సమాచారం.