చరణ్ నిజంగా గొప్ప పనే చేస్తున్నాడు !

Sunday, September 25th, 2016, 05:52:43 PM IST

ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో రిలీజ్ కానున్న ‘ధృవ’ చిత్రం కోసం షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. అంట బిజీలో కూడా ఆయన ఓ సామాజిక కార్యక్రమం కోసం సమయం కేటాయించారు. అదేదో ఇక్కడి లోకల్ లో జరిగే కార్యక్రమం అయితే పెద్ద విశేషమేమీ లేదు. ఆ కార్యక్రమం అమెరికాలో జరగనుంది. వివరాల్లోకి వెళితే ‘రిపబ్లికన్ హిందీ కొయిలిషన్’ అనే చారిటీ అక్టోబర్ 15న అమెరికాలోని న్యూ జెర్సీ లో ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. అందులో రామ్ చరణ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు.

ఇదే విషయమని చెర్రీ తెలుపుతూ ‘రిపబ్లికన్ హిందీ కొయిలిషన్ ఛైర్మెన్ శాలి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గినాల్సిందిగా అడిగారు. టెర్రరిజం భాదితులకు చేయూతగా ఈ షో నిర్వహిసున్నారు. ఇందులో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం కోసం నేను ఈగర్ గా ఎదురుచూసున్నారు. ఈ కార్యక్రమం న్యూ జెర్సీ లో జరుగుతుంది. అందరూ వస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. ఎంతైనా చరణ్ చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమం గొప్ప పనే మరి.