హాట్ టాపిక్: రామ్ చరణ్ “ఆచార్య” నుండి తప్పుకొక తప్పదా?

Friday, June 26th, 2020, 10:43:11 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధీరం చిత్రం లో నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్ర లో కనిపించనున్న రామ్ చరణ్ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. అందుకే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే లాక్ డౌన్ ఆంక్షలు, బిజీ షెడ్యూల్ కారణం గా రామ్ చరణ్ రౌద్రం రణం రుదిరం కోసం తన సమయాన్ని ఎక్కువగా కేటాయించాల్సి ఉంది.

అయితే కొరటాల శివ చిరు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం లో రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్ర లో కనిపించాల్సి ఉంది. అయితే రాజమౌళి చిత్రానికి రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని కేటాయించాల్సి రావడం తో కొరటాల కి చిరు ఒక సలహా ఇచ్చారట. రామ్ చరణ్ కి బదులుగా వేరే హీరో ను ఈ పాత్ర కోసం చూడమన్నారు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ను సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.దీని పై మహేష్ నటించడం లేదు అని క్లారిటీ కూడా వచ్చింది. మరోమారు ఆచార్య చిత్రం లో రామ్ చరణ్ పాత్ర పై చిత్ర యూనిట్ ఆలోచన లో పడింది. మరి దీని పై కొరటాల శివ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.