మళ్ళీ రఫ్ఫాడించిన చరణ్..మరి “వెంకీ మామ” పరిస్థితి ఏంటి?

Thursday, July 23rd, 2020, 05:00:13 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ”. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాభవాన్ని చూసింది. కానీ స్మాల్ స్క్రీన్ పై మాత్రం ఈ సినిమా హిట్టయిన విధంగా బాహుబలి కూడా హిట్టవ్వలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ చిత్రాన్ని స్టార్ మా ఛానెల్ వారు టెలికాస్ట్ చేసిన ప్రతీ సారి టీవీ ఆడియెన్స్ ఒకేలాంటి టీఆర్పీ ను అందించడం విశేషం. ఇప్పటి వరకు 10 సార్లు టెలికాస్ట్ చెయ్యగా కేవలం రెండంటే రెండే సార్లు 7 కంటే తక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై ఏ స్థాయిలో రఫ్ఫాడించిందో అర్ధం అవుతుంది. ఈ చిత్రాన్ని లేటెస్ట్ గా టెలికాస్ట్ చెయ్యగా మళ్ళీ 7.5 టీఆర్పీ రేటింగ్ ను కొల్లగొట్టేసింది.

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే విక్టరీ వెంకటేష్ మరియు తన నిజ జీవిత మేనల్లుడు నాగ చైతన్యలు హీరోలుగా రీల్ లైఫ్ లో మామ అల్లుళ్లుగా నటించిన చిత్రం “వెంకీ మామ”. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటించగా ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇటీవలే ఈ చిత్రాన్ని మొట్ట మొదటి సారిగా జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ చెయ్యగా దీనికి 9.8 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మొత్తానికి వెంకీ మామ స్మాల్ స్క్రీన్ పై కూడా డీసెంట్ గానే అదరగొట్టేసాడు అని చెప్పాలి.