చరణ్ తండ్రినే మించిపోయేలా ఉన్నాడే.!

Thursday, March 26th, 2020, 06:39:11 PM IST


మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఏమనుకొని తమ సరికొత్త ఇన్నింగ్స్ అదే సోషల్ మీడియా ద్వారా మొదలు పెట్టారు.మొదటగా మెగాస్టార్ చిరు ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లోకి వచ్చేసారు. అలా ట్విట్టర్ లో ఒక్క రోజులో ఒక లక్ష 42 వేలు మంది ఫాలోవర్స్ తో ఆల్ ఇండియాలో టాప్ 2లో నిలిచారు.

కానీ ఈరోజు ఫ్రెష్ గా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఇంకా సింపుల్ గా చిరు ను క్రాస్ చేసేసేలా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్ కు ట్విట్టర్ ఖాతా తెరిచిన 4 గంటల 45 నిమిషాల్లోనే 81 వేలకు పైగా ఫాలోవర్స్ ను సాధించేసారు.దీనితో మెగాస్టార్ ఒక్క రోజు ఫాలోవర్స్ ను దాటెయ్యడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి చెప్పాలి.ఒక కొడుకుగా సినిమాల్లోనే కాకుండా ఈ విధంగా కూడా సోషల్ మీడియాలో కూడా తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడని చెప్పాలి.