రామ్ చరణ్ నుంచి అద్భుతమైన జీవిత సత్యం..!

Sunday, July 5th, 2020, 10:46:30 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం ఒక్క హీరో గానే కాకుండా వ్యక్తి గా మంచి ఆదరణను సొంతం చేసుకున్నాడు. తాను హీరోగా ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రూధిరం” అనే భారీ పాన్ ఇండియన్ చిత్రంలో అద్భుతమైన పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ రామ్ చరణ్ సోషల్ మీడియాలో కాస్త తక్కువ గానే యాక్టివ్ గానే ఉండేవారు. కానీ ఇప్పుడు ట్విట్టర్ లో అడుగు పెట్టిన తర్వాత చాలా విషయాలను ఫాలోవర్స్ తో పంచుకోవడం మొదలు పెట్టారు. అలా ఇప్పుడు ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు.

“హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు.” అంటూ తన లాస్ట్ చిత్రం వినయ విధేయ రామ నుంచి తీసిన రెండు అగ్రెసివ్ ఫొటోలతో కలిపి పంచుకున్నారు.