అభిమాని కుటుంబానికి అండగా నిలబడ్డ స్టార్ హీరో…

Sunday, February 9th, 2020, 05:17:51 PM IST

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసి, ఎన్నో వైవిధ్యవంతమైన చిత్రాలు చేస్తూ తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అనతి కాలంలోనే సంపాదించుకున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతానికి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నటువంటి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా తాజాగా మరొక సారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గతంలో ఆయన తన మాటను రామ్ చరణ్ నిలబెట్టుకున్నాడు. కాగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని గ్రేటర్ హైదరాబాద్ సిటీ చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన మరణ వార్త తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సికింద్రాబాద్ లోని మహమ్మద్ ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు.

అయితే మహమ్మద్ చనిపోయిన సమయంలో అవసరాల నిమిత్తం విదేశాల్లో ఉన్న రామ్ చరణ్, ఇక్కడికే వచ్చాక నూర్ మహమ్మద్ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. తాను చెప్పినట్లుగానే రామ్ చరణ్ తేజ్ ఆదివారం నాడు నూర్ మహమ్మద్ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించుకొని మరీ రూ.10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి, వారి కుటుంబానికి రామ్ చరణ్ ఒక భరోసా ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ వార్త సామజిక మాంద్యమాల్లో వైరల్ అవుతుంది.