మొత్తానికి రామ్ గోపాల్ వర్మ అదే చెప్పాలి అనుకున్నారు

Friday, December 13th, 2019, 09:10:01 AM IST

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం గురించి ప్రజలు, ప్రేక్షకులు బిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా కి ఓపెనింగ్ కలెక్షన్లు చూస్తుంటే ప్రజలు ఈ చిత్రం గురించి ఎంతగా తెలుసుకోవాలని అనుకుంటున్నారో తెలుస్తుంది అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అయితే ఈ చిత్రం మాత్రం ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదని తెలుస్తుంది. నిజ జీవిత నటులు ఫిక్షన్ పాత్రలు చేసారని రామ్ గోపాల్ వర్మ అన్నారు. కానీ సినిమా లో కేవలం రాజకీయ నాయకులని అనుకరించారు తప్ప, సినిమా లో అంత విషయం లేదనేది ప్రేక్షకుల అభిప్రాయం.

సినిమా లో జగన్ ని హీరోలా, మిగతా వారిని చూస్తే నవ్వొచ్చేలా సినిమా ఉందని ప్రేక్షకుల అభిప్రాయం కూడా. అయితే జగన్ పాత్రని హైలెట్ చేస్తూ మొత్తానికి రామ్ గోపాల్ వర్మ ఏదైతే సినిమా ద్వారా చెప్పాలనుకున్నారో, అదే చూపించారు అని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం వైసీపీ కి మద్దతుగా ఈ సినిమా ఉందని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.