సెన్సేషన్ ట్వీట్: రామ్ గోపాల్ వర్మకు కరోనా పాజిటివ్..!

Thursday, April 2nd, 2020, 02:00:50 AM IST

సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. అయితే ప్రస్తుతం మానవాళి కరోనా వైరస్ ధాటికి అతలాకుతలం అవుతున్న నేపధ్యంలో వర్మ కూడా దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, తగిన సూచనలు పాటించాలని తెలియచేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇన్ని చేసిన వర్మకు ఇప్పుడు కరోనా సోకింది. అదేంటి వర్మ లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు, ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు ఆయనకెలా సోకింది అనుకుంటున్నారు కదా, ఈ షాకింగ్ నిజాన్ని చెప్పింది వర్మనే. ఇప్పుడే తన డాక్టర్ ఫోన్ చేసి నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పాడని వర్మ ట్వీట్ చేసాడు. అయితే ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఆ ట్వీట్ చేసిన 15 నిమిషాలకే సారీ అందరినీ డిసప్పాయింట్ చేసాను, నాకు కరోనా లేదంట, నా డాక్టర్ నన్ను ఎప్రిల్ ఫూల్ చేసాడు, ఇది నా తప్పు కాదు ఆయనదే అంటూ మరో ట్వీట్ చేసాడు. అయితే దీని వలన ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇలాంటి తరుణంలో వర్మ ఇలా జోక్‌లు వేయడంతో అందరూ తిట్టుకుంటున్నారు.