ఆ బాడీ ఏంట్రా నాయనా.. తారక్ బాడీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Wednesday, May 20th, 2020, 02:09:22 AM IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా జూనియర్ ఎన్‌టీఆర్ శరీర ఆకృతిపై ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. జూనియర్ ఎన్‌టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఆయన జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సిక్స్ ప్యాక్ ఫోటో విడుదల చేసాడు. అయితే విడుదలైన కొద్ది సేపటిలోనే ఈ ఫోటో సోషల్ మీడీయాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

అయితే ఈ ఫోటోను షేర్ చేస్తూ వర్మ తన మార్క్ కామెంట్ చేశాడు. సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఎన్టీఆర్‌ను ఏకంగా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో పోల్చాడు. తాజాగా ఈమెతో క్లైమాక్స్ అనే సినిమా చేసాడు. మియా మాల్కోవా తర్వాత తాను చూసిన బెస్ట్ బాడీ జూనియర్ ఎన్‌టీఆర్‌దే అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు తారక్ నేను గేని కాదని మీకు బాగా తెలుసని ఈ ఫోటోలో మిమ్మల్ని చూశాక నాకు అలా మారిపోవాలని ఉందని తెలుపుతూ ఆ బాడీ ఏంట్రా నాయనా అంటూ పోస్ట్ చేశాడు.