వర్మకు వీరిపై సినిమా తీసే దమ్ము లేదా..?

Sunday, July 12th, 2020, 05:28:07 PM IST

మన ఇండియా మొత్తంలోనే కాంట్రవర్సీయల్ సంచలన దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పాలి. ఈ లాక్ డౌన్ లో కూడా వర్మ తన సినిమాలతో హోరెత్తిస్తున్నారు. లేటెస్ట్ గా తన నుంచి వచ్చిన సంచలన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “పవర్ స్టార్” సినిమా అని చెప్పాలి.

ప్రముఖ సినీ హీరో మరియు పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ పై ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో మ్యాటర్ ఎంత వరకు ఉంటుందో ఏమో కానీ పవన్ ను మాత్రం గట్టుగానే టార్గెట్ చేసాడు అని చెప్పాలి. అయితే ఏపీలో పొలిటికల్ లీడర్స్ పైనే ఈ మధ్య కాలంలో వర్మ రెండు సార్లు సినిమాలు తీసి సంచలనం రేపారు.

ఇందులో చంద్రబాబు మరియు పవన్ ను మాత్రమే గట్టిగా టార్గెట్ చేసారు అని చెప్పాలి. బాబును టార్గెట్ చేసినందుకు టీడీపీ ఫ్యాన్స్ చాలా దూరం వెళ్లారు అయినా వర్మ పట్టించుకోలేదు.అలాగే ఇక పవన్ ను ఒకపక్క పొగుడుతూనే మరోపక్క గట్టిగా టార్గెట్ చేస్తాడు. దీనితో వీళ్ళు ఏమి అనరు అనే అలుసుతో మాత్రమే వర్మ ఈ ధైర్యం చేస్తున్నాడని అదే కేసీఆర్ కానీ వై ఎస్ జగన్ పై కానీ సినిమా చేసే దమ్ము కానీ ధైర్యం కానీ రామ్ గోపాల్ వర్మకు లేవని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.