కోవిడ్-19 వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన చైనా.. వర్మ ట్వీట్..!

Friday, March 27th, 2020, 12:00:30 AM IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటాడు. అయితే తాజాగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో వర్మ ఓ ఫన్నీ ఫోటోను ట్వీట్ చేశాడు.

అయితే కోవిడ్-19 అనే ఓ వాట్సాఫ్ గ్రూప్ క్రియేట్ చేసిన ఓ ఫోటోను ట్వీట్ చేశాడు. ఈ గ్రూపును చైనా క్రియేట్ చేసినట్టు ఆ తరువాత నిన్ను యాడ్ చేసిందని, ఆ తరువాత మిగిలిన ప్రపంచాన్ని యాడ్ చేసినట్టు, ఇకపోతే ఫైనల్‌గా ఈ గ్రూప్ నుంచి చైనా లెఫ్ట్ అయినట్టు అందులో ఉంది. అయితే ఎవరు ఇలా క్రియేట్ చేశారో తెలియదు కానీ ఈ ఫోటోలో ఉన్నది నిజమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.