షాకులిచ్చే వర్మకే ఊహించని షాక్..!

Wednesday, July 22nd, 2020, 10:01:22 AM IST

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ లాక్ డౌన్ లొనే పలు సినిమాలు తీసి ఆశ్చర్య పరిచాడు. ఈ తాను తీసే సినిమాలు మాత్రమే కాకుండా ఈ మధ్యనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా తియ్యడంతో మరింత సంచలనం రేపాడు.

అలా లేటెస్ట్ గా తీస్తున్న మరో పొలిటికల్ డ్రామా “పవర్ స్టార్” ఎన్నికల తర్వాత. ప్రముఖ హీరో మరియు పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ మీదనే సెటైరికల్ గా తీసిన ఈ సినిమాతో ఊహించని హైప్ ను తెచ్చుకున్నాడు. దీనితో ఈ సినిమా ట్రైలర్ నే డబ్బులకు పెట్టేసి ప్రపంచంలో ఏ సినిమాకు చెయ్యని విధమైన హైప్ తెచ్చాడు.

అలాగే సినిమాను కూడా డబ్బులకే పెట్టాడు. కానీ ఇలా ఎన్నో షాకులు ఇచ్చే రామ్ గోపాల్ వర్మకే ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా ట్రైలర్ లీకయ్యిపోవడంతో చేసేది ఏమి లేక ఎవరి డబ్బులు వారికి ఇచ్చేసి మాములుగా ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.