కమెడియన్ గా మిగిలిపోబోతున్న రామ్ గోపాల్ వర్మ.?

Wednesday, November 20th, 2019, 05:30:48 PM IST

ఓల్ ఇండియాకి సోలో వివాదాల దర్శకుడు ఎవరు అంటే అంతా రామ్ గోపాల్ వర్మ పేరే చెప్తారు.అయితే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో “శివ”తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే హిట్ కొట్టాడు.అప్పటి నుంచి మళ్ళీ ఆ స్థాయి హిట్టు అందుకోక పోగా తన స్థాయిని తాను దిగజార్చుకుంటున్నాడని ఇండస్ట్రీ టాక్ కేవలం కొంతమంది వ్యక్తులను టార్గెట్ చెయ్యడం వారై ద్వారా హైలైట్ అవ్వడం అందరి నోట్లో నానడం హాట్ టాపిక్ గా నిలవడం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ దినచర్యగా నడుస్తుంది.

అయితే తన గత చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్”తో పెద్ద సంచలనమే రేపిన వర్మ ఇప్పుడు తన కొత్త చిత్రం “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అంటూ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఎంతో సీరియస్ నోట్ లో ఉండబోతుంది అనుకుంటున్న ఈ చిత్రం తీరా చూసేసరికి మంచి కామెడీ చిత్రంలా మిగిలిపోతుంది అనిపిస్తుంది.ఎందుకంటే ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులను బాగా టార్గెట్ చేస్తూ వారిని చాలా ట్రోల్ చేసే ధోరణిలో చూపిస్తున్నారు.

ఈ అంశాలు మాత్రం ఖచ్చితంగా ఈ చిత్రంలో బాగా నవ్వు తెప్పించే అవకాశాలు గట్టిగా ఉన్నాయి.ఎందుకంటే ఎక్కువగా జనాలు కూడా ఈ చిత్రాన్ని ఫుల్లుగా నవ్వుకోడానికే చూడాలనుకుంటున్నామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కానీ ఇతర రాజకీయ నాయకులని డీగ్రేడ్ చేస్తున్నానని తనని తాను ఏదోలా ఫీలయ్యిపోయే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఈ చిత్రం ద్వారా కమెడియన్ గా మిగిలిపోయేలా ఉన్నాడు.ఇక నుంచి అయినా తన స్టైల్ చిత్రాలు తీస్తే నిజమైన రామ్ గోపాల్ వర్మ నుంచి ఏవైతే అంశాలు ఆశిస్తున్నారో ఆ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారు.