తన చిత్రంలో బాలయ్య పాత్రపై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ…

Tuesday, November 19th, 2019, 12:20:36 AM IST

ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పాలి. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో కొందరు ముఖ్యమైన ప్రముఖులను వారి క్యారెక్టర్లను చుపిస్తున్నామని వర్మ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. కాగా దానికి తోడు అందరు నాయకులను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతో సహా అందరిని కూడా తన చిత్రంలోవాడుకున్నాడు.

అయితే టీడీపీ లో కీలకంగా ఉన్నటువంటి నందమూరి వారసుడు బాలకృష్ణ పాత్ర కి సంబందించిన ఎలాంటి విషయాన్నీ కూడా వర్మ బయటపెట్టలేదు. దానికి కారణాన్ని వెల్లడించారు వర్మ. అసలు తన సినిమాలో బాలకృష్ణ పాత్ర లేదని, ఆయన పాత్ర లేకుండానే సినిమాను తీశామని వర్మ ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ వారికీ వెల్లడించారు. ఇకపోతే ఆయన చిత్రంలో బాలకృష్ణ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేని కారణంగానే బాలయ్య పాత్రను పెట్టలేదని వర్మ వెల్లడించారు. అంతేకాదు భవిష్యత్తులో ఆయనతో ఎలాంటి సినిమాలు కూడా చేయనని వర్మ ఖరాఖండిగా చెప్పేసాడు.