ఇక నుంచి ఆర్జీవీ మరింత టార్గెట్ చెయ్యడం ఖాయమా..?

Friday, July 24th, 2020, 02:24:02 PM IST

తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టిన చిచ్చు పెద్ద రచ్చనే లేపింది. కేవలం సినిమా పరంగా మాత్రమే కాకుండా పొలిటికల్ గా కూడా పవన్ ఇమేజ్ ను దెబ్బ తీసే విధంగా తీసిన రామ్ గోపాల్ వర్మ తీసిన “పవర్ స్టార్” రేపిన కలకలం అంతా ఇంతా కాదు.

దీనితో పవన్ ఫ్యాన్స్ అతన్ని కొట్టేయడానికి అతని ఇంటికి కూడా వెళ్లిపోయారు. దీనితో వర్మ భయపడడం మొట్టమొదటి సారి చాలా మంది చూసారు. మీడియా ముఖంగా ఛాలెంజ్ చేసి తీరా అంతమంది అభిమానులు ఒకేసారి వచ్చేసే సరికి ఓ రూమ్ లో దాక్కోవాల్సి వచ్చింది వర్మకు దీనితో పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

కానీ వర్మ మాత్రం ఈ విషయన్ని అంత సింపుల్ గా తీసుకునే అవకాశం లేదని అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో పవన్ ను మరింత స్థాయిలో టార్గెట్ చెయ్యడం కన్ఫర్మ్ అని చెప్పకనే చెప్పేసాడు. ఆ ఘటన అనంతం ఓ ఇంటర్వ్యూలో లో మాట్లాడుతూ భవిష్యత్తులో తానేంటో చూపిస్తా చెయ్యాల్సిందే చేస్తా అంటూ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. మరి వర్మ ఏం చేస్తాడో చూడాలి.