ఆర్జివి సరికొత్త ప్రపంచం కూడా అలాంటిదేనా?

Sunday, May 31st, 2020, 11:30:37 AM IST

ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా మన దేశంలోనే తన సినిమాలతో సంచలన దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది రామ్ గోపాల్ వర్మే అని చెప్పాలి. అలా రామ్ గోపాల్ వర్మ చేసిన చిత్రాలలో అడల్ట్ ఫీమేల్ మియా మాల్కోవతో చేసిన సినిమా కూడా ఒకటి. అది అప్పట్లో పెను ధుమరమే రేపింది.

దానితో థియేటర్స్ లో విడుదల కానివ్వకపోయినా యూట్యూబ్ లో పెట్టేస్తానని సంచలనమ్ రేపారు. ఇప్పుడు అదే మియాతో చేసిన ఓ సినిమాయో షార్ట్ ఫిలిం లాంటిదో కానీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. దానికి “క్లైమాక్స్” అనే పేరు పెట్టారు.

ఈ వీడియో కొమ్మా ఇప్పుడు ఏకంగా “రామ్ గోపాల్ వర్మ వరల్డ్” అనే సరికొత్త ప్రపంచాన్ని సృష్టించేసారు. అది కూడా ఒక థియేటర్ లాంటిదే అని ఒకవేళ ఆ వీడియో చూడాలి అనుకుంటే ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ను డౌన్ లోడ్ చేసి ఒక్కసారి చూడాలంటె 100 రూపాయలు చెల్లించి చూడాలి అని తెలుపుతున్నారు.

అయితే ఇది కూడా ఒక రకంగా ఓటిటి లాంటిదే కానీ మినీ సైజ్ థియేటర్ అని చెప్పాలి. దీనిని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే ప్రముఖ సంస్థ శ్రేయాస్ మీడియా వారు ప్రెజెంట్ చేసారు. మరి ఈ యాప్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో లేక ఈ మధ్య కాలంలో వస్తున్న ఆర్జివి సినిమాల్లానే ఢాం అంటుందో చూడాలి.