నాని దర్శకుడితో రామ్ సినిమా ?

Monday, February 26th, 2018, 09:43:29 PM IST

ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉన్నది ఒకటే జిందగీ సినిమా భారీ పరాజయాన్ని అందుకోవడంతో రామ్ ఆశలు అడియాశలయ్యాయి. దాంతో మరో హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ తాజాగా నాని దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా .. నానితో నేను లోకల్ లాంటి మాస్ హిట్ సినిమా అందించిన త్రినాధ్ రావు నక్కిన. ఇదివరకే త్రినాధ్ రావు చెప్పిన కథ బాగా నచ్చడంతో రామ్ ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఇందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసారు. మరో హీరోయిన్ కూడా నటిస్తుందని సమాచారం. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమా మార్చ్ 8 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. దేవి శ్రీ సంగీతం అందిస్తాడని తెలిసింది.