టాలీవుడ్ లో సరికొత్త కాంబినేషన్…మురుగదాస్ తో ఇస్మార్ట్ శంకర్?

Friday, June 4th, 2021, 10:00:39 AM IST

సంచలన చిత్రాల దర్శకుడు మురుగదాస్ మరొకసారి తెలుగు ప్రేక్షకులని అలరించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే గజిని, స్టాలిన్, 7th సెన్స్, స్పైడర్ లాంటి చిత్రాలను అందించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. అయితే ఇష్మార్ట్ శంకర్ తో రామ్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల్లో కూడా గుర్తింపు పొందారు. అయితే మురుగదాస్ రామ్ తో ఒక చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రామ్ ను కలిసి కథ వినిపించినట్లు సమాచారం. అయితే రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సరికొత్త కాంబినేషన్ పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. రామ్ ఇప్పటికే మరొక తమిళ దర్శకుడు లింగుస్వామి తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

రామ్ లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో కృతి శెట్టి కథానాయిక గా నటిస్తుండగా, మాధవన్ ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తున్నారు. అయితే సినిమా ఏక కాలం లోతెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్క నుంది.