హాట్ టాపిక్: రామ్ “రెడ్” చిత్రానికి భారీ డిమాండ్..!

Saturday, July 11th, 2020, 01:22:17 AM IST


ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో రామ్ తాజాగా నటిస్తున్న రెడ్ చిత్రానికి భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఓటిటీ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కి పలు సంస్థలు 30 కోట్ల రూపాయలకి పైగా చెల్లించేందుకు ముందుకు వచ్చాయనీ సమాచారం. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమాల విడుదలలు అన్ని ఓటిటీ ద్వారానే సాధ్యం అయ్యాయి. అయితే ఈ ఆఫర ను చిత్ర యూనిట్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ రెడ్ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే లేట్ అయినా ఈ సినిమా ను దేయేటర్ లో నే విడుదల చేయాలని చిత్త యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కి సిద్దం గా ఉన్నా కరోనా వైరస్ కారణంగా ఇంకా దేయేటర్లు తెరుచుకోలేదు. అయితే ఇదే తరహాలో ఉప్పెన చిత్ర యూనిట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.