చిరు సినిమాలో చరణ్ – క్లారిటీ వచ్చేనా…?

Tuesday, October 15th, 2019, 02:28:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం సైరా… విడుదలైన అన్ని చోట్ల కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకొని విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా చిరు తరువాత చేయబోయే సినిమా విషయంలో అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇటీవలే తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని, దానికి సంబందించిన పూజ కార్యక్రమాకు కూడా చేశారు. కాగా ఈ సినిమాలో చిరు తో పాటు చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటారని పలు ఊహాగానాలు వచ్చాయి. దాదాపు అదే ఖాయమని అందరు కూడా ఫిక్స్ అయ్యారు.

కానీ ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివ ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే, చిరంజీవి – కొరటాల సినిమాలో రామ్‌చరణ్‌ నటించడం లేదు. అయితే ఇప్పటివరకు వచ్చిన పుకార్లన్నీ కూడా నమ్మొద్దని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. కాగా అసలు చరణ్ కి సంబంధించి ఎలాంటి పాత్ర కూడా లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ చిత్రంలో చిరు కి జోడిగా ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్నారంట. అయితే తదితర వివరాలన్నీ కూడా త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మాతలు.