సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు రాంచరణ్ భార్య ఉపాసన అదిరిపోయే సలహా – ఇంతకీ ఏంటో తెలుసా…?

Saturday, October 19th, 2019, 11:13:19 PM IST

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ భార్య ఉపాసన, మనందరికీ కేవలం మెగా కోడలుగానే ఎక్కువగా పరిచయం. కానీ ఆమె తన అపోలో ఆసుపత్రుల సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. అంతేకాకుండా వీలైనంత సేవ కార్యక్రమాలకు కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు ఉపాసన. కాగా ఈంరకు డిజిటల్ స్పేస్ యూట్యూబ్ వేదిక ద్వారా ఆరోగ్య సంబంధ వీడియోలు చేస్తూ, తనదైన గుర్తింపుతో దూసుకుపోతున్నారు. కాగా ఉపాసన తాజాగా చేసినటువంటి ఆరోగ్య పరమైన వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

ఈ వీడియో ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మరియు ఇతర కార్పొరేట్ ఉద్యోగుల కోసమని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఉద్యోగులు అందరు కూడా తమ ఆఫీసులలో ఎక్కువగా సీట్లకు అతుక్కుపోయి తమ పనితో బిజీగా కాలం గడుపుతున్నారు. అలాంటి వారికి వారు కూర్చున్నటువంటి స్థానంలోనే ఎలాంటి వ్యాయామం చేయాలనే అంశం పై ఉపాసన, ఒక ఫిట్ నెస్ గురువుతో ఒక వీడియో చేశారు. అయితే ఇప్పటికే ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందని సదరు నెటిజన్లు తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.