రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Wednesday, March 25th, 2020, 06:25:23 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం మోషన్ పోస్టర్ తాజాగా విడుదల అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచాలున్నాయి. ఉగాది కానుకగా విడుదల అయిన ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. రౌద్రం, రణం, రుదిరం అంటూ రాజమౌళి పాత్రలకు జస్టిఫై చేస్తూ మోషన్ పోస్టర్ లో చూపించారు. అయితే ఇప్పటికే ఈ దీనిపై పలువురు ప్రముఖులు, సినీ హీరోలు, విశ్లేషకులు స్పందించారు.

ఈ మోషన్ పోస్టర్ పై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశ ప్రజలందరూ భయాందోళన చెందుతున్నారు. ఈ సమయంలో రాజమౌళి ఈ మోషన్ పోస్టర్ నీ విడుదల చేయడం పట్ల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ప్రభావం తో ప్రజలంతా డిప్రెషన్ లో లోకి వెళ్ళిన సందర్భంలో రాబోయే మంచి కోసం ఎదురు చూడాలని మాకు గుర్తు చేసిన రాజమౌళి కి ధన్యవాదాలు అని అన్నారు. అయితే ఇందులో కోవిద్ లాంటి భయంకర విషయాలతో పాటు గొప్ప విషయాలు కూడా ఉన్నాయన తెలిపారు.