మీకు ఒక దుర్వార్త – కేవలం మీకే : రాంగోపాల్ వర్మ

Wednesday, December 11th, 2019, 10:50:02 PM IST

ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మళ్ళీ కొన్ని వివాదాస్పదమైన వాఖ్యలు చేశారు. కాగా రాంగోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో తాజాగా తెరకెక్కిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు… అయితే కొన్ని కారణాల వలన ఈ చిత్ర టైటిల్ ని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు గా మార్చేశారు. అయితే ఈ చిత్రం పై తెలంగాణ హైకోర్టు విచారించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ విషయంలో కలుగజేసుకోమని చెప్పారు. ఇక చివరికి ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ లభించింది.

అయితే తన చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికెట్ లభించిన ఆనందంలో ఉన్న వర్మ, ఈ నేపథ్యంలో ఒక ట్వీట్ చేశారు. మా ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను ఆపాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ దుర్వార్త… నా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది, సెన్సార్ బోర్డుతోను అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. అంతేకాకుండా మీ చెత్త ఐడియాలతో సినిమాను అడ్డుకోవడానికి మగవాళ్లు, జోకర్లు ఉంటే రావాలని రామ్ గోపాల్ వర్మ సవాల్ విసిరాడు. ఎట్టకేలకు నా చిత్రం రేపు విడుదలవుతుందని వర్మ పేర్కొన్నారు.