కేజీఎఫ్-2: ఆ పాత్ర కోసం రమ్యక్రిష్ణ భారీగా డిమాండ్..!

Wednesday, February 12th, 2020, 11:56:59 PM IST

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యువ హీరో య‌శ్ హీరోగా తెరకెక్కిన సినిమా కేజీఎఫ్. అక్రమ మైనింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కూడా మంచి విజయాన్ని సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా కేజీఎఫ్ చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్‌లో అధీరా అనే పాత్రను సస్పెన్షన్‌లో పెట్టిన మేకర్స్ ఆ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను జూలై 29న విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అంతేకాదు ఇటీవల తెలుగు నటుడు రావు రమేశ్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టు దర్శకుడు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో లేడీ పీఎమ్ పాత్రకి రమ్యకృష్ణను అడగగా ఆ పాత్ర ప్రాధాన్యతను బట్టి ఆమె పెద్ద మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేసిందని అందుకే ఆ పాత్రకు రవీనా టాండన్ ను తీసుకున్నాట్టు సమాచారం. అయితే తెలుగు, తమిళ భాషలలో రమ్యకృష్ణకు మంచి క్రేజ్ ఉండడంతో ఆమె ఏ సినిమాకైనా పెద్ద మొత్తమే డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.