ర‌మ్య‌కృష్ణ (X) ఖుష్బూ (X) సుహాసిని!?

Sunday, April 8th, 2018, 01:47:20 AM IST

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన `పా పాండి` త‌మిళంలో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాని ఇరుగుపొరుగు భాష‌ల్లో రీమేక్ చేసేందుకు ఫిలింమేక‌ర్స్ సీరియ‌స్‌గా స‌న్నాహాలు చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే క‌న్న‌డ‌లో రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు వేగ‌వంత‌మ‌య్యాయి. త‌మిళ వెర్ష‌న్‌లో ధ‌నుష్ పోషించిన పాత్ర‌ను కిచ్చ సుదీప్ క‌న్న‌డ‌లో పోషిస్తున్నాడు.

రాజ్‌కిర‌ణ్ పోషించిన పాత్ర‌లో సీనియ‌ర్ న‌టుడు అంబ‌రీష్ న‌టిస్తార‌ని తెలుస్తోంది. మ‌రో సీనియ‌ర్ న‌టి రేవ‌తి త‌మిళంలో చేసిన పాత్ర‌ను క‌న్న‌డ‌లో సుహాసిని మ‌ణిర‌త్నం పోషించ‌నున్నారు. ఇంత‌మంది పెద్ద స్టార్లు న‌టిస్తున్న ఈ చిత్రానికి ర‌మ్య‌కృష్ణ‌, ఖుష్బూ సుంద‌రం వంటి తారామ‌ణులు యాడ‌వ్వ‌డంతో కాన్వాసు ఏ రేంజుకు వెళుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ చిత్రంలో ర‌మ్య‌, ఖుష్బూ అతిధి పాత్ర‌ల్లో త‌ళుక్కుమ‌ని మెరుస్తార‌ట‌. బాహుబ‌లి శివగామిగా ర‌మ్య‌కృష్ణ ఇమేజ్‌, త‌మిళ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న నాయ‌కురాలిగా ఖుష్బూ ఇమేజ్ క‌న్న‌డ‌లోనూ వ‌ర్క‌వుట‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు. భారీ తారాగ‌ణం వ‌ల్ల సినిమా కాన్వాసు అంతే భారీగా త‌యారైంది.