సలార్ మూవీలో రమ్యక్రిష్ణ.. కీ రోల్ ప్లే చేయనుందట?

Tuesday, May 11th, 2021, 01:32:11 AM IST

బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ స్మాలతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా “సలార్” పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించబోతోదంటూ ప్రచారం జరుగుతుంది. తన నటన, హావా భావాలతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్న రమ్యక్రిష్ణ సలార్ సినిమాలో ప్రభాస్‌కు అక్కగా నటించబోతుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరగండూర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది.