`రంగం` హీరోయిన్ గుండు క‌హానీ!

Sunday, February 25th, 2018, 09:42:28 PM IST

`రంగం` ఫేం పియా బాజ్‌పాయ్ ఇటీవ‌ల గుండుతో ద‌ర్శ‌న‌మిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆర్‌.విజ‌య‌ల‌క్ష్మి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ `అభియుం అనువుం` మార్చి 9న‌ రిలీజ‌వుతోంది. మలయాళ నటుడు డోవినో థామస్ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌గా, సీనియర్‌ నటి రోహిణి కీలకపాత్ర పోషించారు.

లేటెస్టుగా ప్రియా భాజ్‌పాయ్ ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ గుండు గురించి అస‌లు సీక్రెట్ ఓపెన్ చేసింది. ఈ రూపం తో న‌టించేప్పుడు రోజూ 12-13 గంట‌లు సెట్‌లోనే క‌ష్ట‌ప‌డేదానిని. ఉద‌యం 7 గంట‌ల‌కే షూటింగ్ అంటే వేకువఝాము 3గంట‌ల‌కు నిదుర లేచేదానిని. నాలుగు నుంచి ఐదు గంట‌లు మేక‌ప్‌కే ప‌ట్టేది“ అని చెప్పింది. అయితే ఇదివ‌ర‌కూ ఇది నిజమైన గుండు అని న‌మ్మిన వారికి ఇది జోల్ట్ అనే చెప్పాలి. పియా నిజంగానే గుండు కొట్టించుకోకుండా అలా క‌ల‌రిచ్చింద‌ని అర్థ‌మవుతోంది. అయితే ఇటీవ‌ల ఓ చిత్రం కోసం క‌థానాయిక పూర్ణ నిజంగానే గుండు కొట్టించుకున్న సంగ‌తి తెలిసిందే.