చిట్టిబాబుకు గట్టిగానే వర్కవుట్ అయిందిగా ?

Tuesday, April 24th, 2018, 12:06:37 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన రంగస్థలం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మార్చ్ 30 న విడుదలైన ఈ సినిమా ఏకంగా 200 కోట్ల వసూళ్లు సాధించింది. సమంత, రామ్ చరణ్ ల నటన హైలెట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతూనే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చిన రంగస్థలం సినిమాను ఇతర భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి రంగస్థలం 24 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
వసూళ్లు షేర్ లలో ..
నైజాం – 25. 08 కోట్లు,
సీడెడ్ – 16. 05 కోట్లు,
ఉత్తరాంధ్రా – 12. 01 కోట్లు,
ఈస్ట్ – 7. 10 కోట్లు,
వెస్ట్ – 5. 64 కోట్లు,
గుంటూరు – 7. 86 కోట్లు,
కృష్ణా – 6. 52 కోట్లు,
నెల్లూరు – 3. 11 కోట్లు,
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 83. 47 కోట్లు,
రెస్ట్ అఫ్ ఇండియా – 10. 80 కోట్లు,
ఓవరిసీస్ – 16. 50 కోట్లు,
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కలిపి – 110. కోట్లు.

  •  
  •  
  •  
  •  

Comments