`రంగ‌స్థ‌లం` తెచ్చిన పెనుముప్పు?

Sunday, April 1st, 2018, 11:54:52 PM IST


చిన్న సినిమాపై పెద్ద సినిమా స‌వారీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. సినిమా బావుంది అని టాక్ వ‌చ్చినా, పెద్ద సినిమాల రాక‌తో చిన్న సినిమా ఫ‌లితం తారుమారైపోతోంది. పెద్ద సినిమా వ‌స్తే, చిన్న సినిమాని థియేట‌ర్ల నుంచి తొల‌గించ‌డం రివాజు. అందుకే చిన్న నిర్మాత‌లంతా గోల‌గగ్గోలు పెట్టేస్తుంటారు. ఫ్లాపైన‌ సినిమా మాట అటుంచితే, బాగా ఆడుతున్న‌ సినిమాని థియేట‌ర్ల నుంచి తొల‌గించ‌డం చూస్తున్న‌దే.

ప్ర‌స్తుతం `రంగ‌స్థ‌లం` దెబ్బ‌కు అదే జ‌రుగుతోంది. రామ్‌చ‌ర‌ణ్ లాంటి పెద్ద స్టార్ న‌టించిన సినిమాకి స‌క్సెస్ అన్న టాక్ వ‌స్తే ఇక ఏదీ మిగ‌ల‌దని తాజా స‌న్నివేశం చెబుతోంది. ముఖ్యంగా నైజాం మార్కెట్‌లా భారీ లాభాలిస్తున్న అమెరికాలో రంగ‌స్థ‌లం దెబ్బ‌కు క‌ళ్యాణ్‌రామ్ `ఎంఎల్ఏ`, శ్రీ‌విష్ణు `నీదీ నాదీ ఒకే క‌థ‌` చిత్రాల్ని థియేట‌ర్ల నుంచి ఎత్తేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే `నీదీ నాదీ ఒకే క‌థ‌` సినిమాకి థియేట‌ర్లు లేని స‌న్నివేశం నెల‌కొందిట‌. అంతేకాదు ఈ రెండు సినిమాల వ‌సూళ్లలో భారీగా డ్రాప్ కనిపించింద‌ని అమెరికా ట్రేడ్ చెబుతోంది. `నీది నాది ఒకే క‌థ` గురు- 1017 డాల‌ర్లు, శుక్ర‌- 1630 డాల‌ర్లు వ‌సూలు చేయ‌గా, ఎంఎల్ఏ గురు-939 డాల‌ర్లు, శుక్ర‌- 255 డాల‌ర్లు, శ‌ని- 436 డాల‌ర్లతో పూర్తిగా ప‌డిపోయాయ్‌. రంగ‌స్థ‌లం భారీ విజ‌యం ఇత‌ర చిన్న సినిమాల‌ను పెద్ద దెబ్బ కొట్టింద‌న్న‌ది ట్రేడ్ చెబుతున్న మాట‌.

  •  
  •  
  •  
  •  

Comments