రామ్ చరణే పెద్ద అడ్డంకి !

Saturday, September 30th, 2017, 02:15:40 PM IST

మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కబోతోంది. ఎక్కువకాలం పాటు స్క్రిప్ట్ వర్క్ లోనే ఉండిపోయింది. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఎట్టకేలకు ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. అయినా కూడా ఇప్పట్లో సైరా చిత్రం సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు. దానికి కారణం రామ్ చరణే.

రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం చిత్రంలో నటిస్తున్నాడు. సైరా కోసం సినిమా టోగ్రాఫర్ గా మొదట రవి వర్మ ని తీసుకున్నారు. కానీ అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మరో సినిమా టోగ్రాఫర్ ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగస్థలం చిత్రానికి పనిచేస్తున్న రత్నవేలు ని సైరా కోసం ఎంపిక చేసారు. కానీ రంగస్థలం చిత్ర షూటింగ్ ఇంకా నెలకు పైగా ఉందట. దీనితో సైరా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. చరణ్ వలన మెగాస్టార్ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments