ఐటెం సాంగ్ వల్లే ‘రంగస్థలం’ లేట్ అవుతోందా?

Friday, January 19th, 2018, 01:37:46 PM IST

రాంచరణ్, సుకుమార్ ల కలయికలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న’రంగస్థలం’ చిత్రం ఆలస్యం కావడానికి అసలు కారణం ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఐటెం సాంగ్ అని సమాచారం అందుతోంది. నిజానికి ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఈ పాటికే పూర్తి కావలసిందని, అయితే అనుకున్న స్టాండర్డ్స్ కి తగ్గట్లు ఆ సాంగ్ లేదని అందువల్లే కొంత జాప్యం జరుగుతోందని , ఇప్పటివరకు మొత్తం 2 పాటలు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. ఇదివరకు దేవి, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఐటెం సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కనుక ఈపాట కూడా ఆస్థాయిలోనే ఉండేటట్లు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మరిన్ని సిట్టింగ్స్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఐటెంసొంగ్ పక్కాగా కుదిరిన తర్వాతే షూటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించడం వల్ల ఈ షెడ్యూల్ ఇంత ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం రాంచరణ్, సమంతల పై ఒక డ్యూయెట్ పిక్చరైజ్ చేస్తున్నారట. అది పూర్తికాగానే ఐటెంసొంగ్ తాలూకు కంపోజింగ్ పూర్తి అవుతుందని, వెనువెంటనే ఆ సొంగ్ ను నటి పూజ హెగ్డే పై చిత్రీకరిస్తారని తెలుస్తోంది. చిత్రం లో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని, చరణ్ ఫాన్స్ ని తప్పక ఖుషి చేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 26 న విడుదలకానుంది.